Monday, 7 September 2026
  • Home  
  • నెల్లూరులో 24 గంటల్లోనే తప్పిపోయిన చిన్నారి గుర్తింపు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో 24 గంటల్లోనే తప్పిపోయిన చిన్నారి గుర్తింపు

నెల్లూరు: సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి లోకేశ్‌ను పోలీసులు 24 గంటల్లోనే సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి అదృశ్యంపై సమాచారం అందుకున్న వెంటనే సంతపేట సీఐ సోమయ్య ఆదేశాలతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల పరిశీలనతో పాటు సాంకేతిక బృందం సహకారంతో చిన్నారి ఆచూకీ కోసం విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో జొన్నవాడ సమీపంలోని దొడ్ల డెయిరీ వద్ద చిన్నారి ఉన్నట్లు గుర్తించి సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డను సురక్షితంగా తిరిగి అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు వేగంగా స్పందించి చేపట్టిన చర్యలను పలువురు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.