అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన పాపకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలని వినతి
ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి తోడు, అంగవైకల్యంతో పాప జన్మించడంతో ఆమె మంచానికే పరిమితమైంది. పాపను తల్లి లక్ష్మీదేవి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. అయితే తల్లికి వయసు మీద పడటంతో పాప పోషణ భారంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న రూ.6 వేల పింఛన్ సరిపోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాప వైద్యం, మందులు, ఇతర అవసరాలకు మరింత ఆర్థిక సహాయం అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో పింఛన్‌ను రూ.15 వేలకు పెంచి ఆదుకోవాలని కోరుతూ సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు లక్ష్మీదేవి అర్జీ సమర్పించారు. అధికారులు మానవతా దృక్పథంతో స్పందించాలని ఆమె వేడుకున్నారు.


