మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘లీడర్షిప్ కాంక్లేవ్’ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. పార్టీ నాయకత్వ పటిష్టత, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సమన్వయం, ప్రజలకు మరింత చేరువయ్యే విధానాలపై చర్చించారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం ఉత్సాహభరితంగా సాగింది.

టీడీపీ ‘లీడర్షిప్ కాంక్లేవ్’లో కీలక చర్చలు