మార్కాపురం జిల్లా హనుమంతునిపాడు మండలం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహమ్మదాపురంను కనిగిరి ఉప విద్యాశాఖ అధికారి సంజీవి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మాట్లాడి, పాఠశాల విద్యాభివృద్ధికి చేయవలసిన కార్యక్రమాలను వివరించారు. మిషన్ మార్చ్ 2027 అమలు అయ్యే తీరును గమనించారు.అందులో భాగంగా పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించి, తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్.ఎం.ఎం.ఎస్ కు సంసిద్ధమవుతున్న 8 వ తరగతి విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థులను ప్రశ్నలను అడిగి, సరైన సమాధానాలను రాబట్టారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకమును పర్యవేక్షించి, భోజనం రుచి చూశారు.అనంతరం పాఠశాల రిజిస్టర్లు తనిఖీ చేసి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.



