రాజమహేంద్రవరం, సెప్టెంబరు 6 (పున్నమి ప్రతినిధి): రాజమహేంద్రవరం దానవాయిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అశ్వత్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అశ్వత్ హాస్పిటల్ కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్ పాల్గొని ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.



