తిరుచానూరు, సెప్టెంబర్ ,పున్నమి ప్రతినిధి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ బలరామ కృష్ణస్వామి వారు శనివారం సాయంత్రం ఉభయ దేవేరులు రుక్మిణి, సత్యభామ సమేత స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. కృష్ణాష్టమి రెండవ రోజులో భాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి, రుక్మిణి, సత్యభామ సమేత స్వామి వారిని శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం ఆలయ సన్నిధి వీధిలో నిర్వహించిన ఉట్టి ఉత్సవం భక్తులను ఎంతగానో ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్, ముని చెంగల్రాయులు, సురేష్, ఏవిఎస్వో శ్రీహరి రావు, అర్చకులు బాబు స్వామి, ఇన్స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంత్, మునస్వామి తదితరులు పాల్గొన్నారు.



