Monday, 7 September 2026
  • Home  
  • ఏన్కూరు లో మాజీ మంత్రి అజయ్ కుమార్‌ కు ఆత్మీయ పలకరింపు
- ఖమ్మం

ఏన్కూరు లో మాజీ మంత్రి అజయ్ కుమార్‌ కు ఆత్మీయ పలకరింపు

ఏన్కూర్‌లో మాజీ మంత్రి అజయ్ కుమార్‌కు ఆత్మీయ పలకరింపు పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: జూలూరుపాడులో నిర్వహించే కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రి అజయ్ కుమార్ ఆదివారం మార్గమధ్యలో ఏన్కూర్ ప్రధాన కూడలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి అజయ్ కుమార్ కొద్దిసేపు ముచ్చటించారు. స్థానిక పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై వారితో ఆరా తీశారు. కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏన్కూర్‌లో మాజీ మంత్రి అజయ్ కుమార్‌కు ఆత్మీయ పలకరింపు

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు:
జూలూరుపాడులో నిర్వహించే కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రి అజయ్ కుమార్ ఆదివారం మార్గమధ్యలో ఏన్కూర్ ప్రధాన కూడలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి అజయ్ కుమార్ కొద్దిసేపు ముచ్చటించారు. స్థానిక పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై వారితో ఆరా తీశారు. కార్యకర్తలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.