వరికుంటపాడు మండలం కొండాయపాలెం పంచాయతీ పరిధిలోని ధర్మవరం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ నూతన గర్భాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో మంజూరైన రూ.70 లక్షల నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధితో గ్రామానికి ఆధ్యాత్మిక శోభ పెరగడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ధర్మవరం కోదండరామస్వామి ఆలయానికి నూతన శోభ.. రూ.70 లక్షలతో గర్భాలయ నిర్మాణానికి శంకుస్థాపన