కలిగిరి మండలం చిన్న అన్నలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తూర్పు మాలపాలెం గ్రామంలో నిరుపేద కుటుంబానికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత అందించింది. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు పల్లా మాల్యాద్రి–ప్రశాంతి దంపతుల కుమార్తె హేమలత వివాహ సందర్భంగా రూ.10,000 విలువైన పెళ్లి కానుకను ట్రస్ట్ సభ్యులు అందజేశారు. పేద కుటుంబాల సంక్షేమం, వారి జీవితాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కలిగిరి మండల టీడీపీ అధ్యక్షుడు పూసాల వెంగపనాయుడు, గంజాం రాఘవేంద్ర, కిలారి కొండప నాయుడు, మదన్ కుమార్, పి.వరప్రసాద్, కొప్పోలు కొండలరావు, మల్లికార్జున, ట్రస్ట్ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబానికి చేయూతగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పెళ్లి కానుక