స్వయంగా రోడ్డెక్కి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎమ్మెల్యే
తాత్కాలిక దారి మళ్లింపునకు జేసీబీతో చర్యలు
హైవే అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం
నెరడిగొండ: నెరడిగొండ మండలంలోని కుప్టి ఘాట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో నియోజకవర్గ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వయంగా కుప్టి ఘాట్ వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఎమ్మెల్యే స్వయంగా బ్రిడ్జిపై నిలబడి వాహనాలను పంపిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం కుప్టి బస్టాప్ వద్ద భారీ వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక దారి మళ్లింపు ఏర్పాటుకు జేసీబీ సహాయంతో చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా హైవే అధికారుల తీరుపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు తగిన స్థాయిలో స్పందించకపోవడం బాధాకరమన్నారు.
ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, హైవే అధికారులు సమస్యను పట్టించుకోకపోవడంతో నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తానే స్వయంగా కుప్టి ఘాట్‌కు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే చర్యలు చేపట్టానన్నారు. భారీ వాహనాల దారి మళ్లింపు కోసం జేసీబీ సహాయంతో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామని, మరికొద్దిసేపట్లో ట్రాఫిక్‌ను పూర్తిగా క్లియర్ చేస్తామని తెలిపారు.
కుప్టి బ్రిడ్జి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం త్వరలో హైదరాబాద్‌లో హైవే అధికారులను కలుస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కుప్టి బ్రిడ్జికి శాశ్వత పరిష్కారం లభించే వరకు సమస్యను వదిలిపెట్టేది లేదని అన్నారు.
నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైన సమయంలో తక్షణమే స్పందిస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు.

కుప్టి ఘాట్‌లో ట్రాఫిక్ జామ్.. రంగంలోకి ఎమ్మెల్యే అనిల్ జాదవ్!
స్వయంగా రోడ్డెక్కి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎమ్మెల్యే తాత్కాలిక దారి మళ్లింపునకు జేసీబీతో చర్యలు హైవే అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం నెరడిగొండ: నెరడిగొండ మండలంలోని కుప్టి ఘాట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో నియోజకవర్గ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వయంగా కుప్టి ఘాట్ వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఎమ్మెల్యే స్వయంగా బ్రిడ్జిపై నిలబడి వాహనాలను పంపిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం కుప్టి బస్టాప్ వద్ద భారీ వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక దారి మళ్లింపు ఏర్పాటుకు జేసీబీ సహాయంతో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా హైవే అధికారుల తీరుపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు తగిన స్థాయిలో స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, హైవే అధికారులు సమస్యను పట్టించుకోకపోవడంతో నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తానే స్వయంగా కుప్టి ఘాట్‌కు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే చర్యలు చేపట్టానన్నారు. భారీ వాహనాల దారి మళ్లింపు కోసం జేసీబీ సహాయంతో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామని, మరికొద్దిసేపట్లో ట్రాఫిక్‌ను పూర్తిగా క్లియర్ చేస్తామని తెలిపారు. కుప్టి బ్రిడ్జి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం త్వరలో హైదరాబాద్‌లో హైవే అధికారులను కలుస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కుప్టి బ్రిడ్జికి శాశ్వత పరిష్కారం లభించే వరకు సమస్యను వదిలిపెట్టేది లేదని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైన సమయంలో తక్షణమే స్పందిస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు.

