Wednesday, 2 September 2026
  • Home  
  • పదవీవిరమణ బాధ్యతకే ముగింపు.. సేవలకు కాదు, ఇంద్రసేనారెడ్డి సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
- మేడ్చల్ – మల్కాజిగిరి

పదవీవిరమణ బాధ్యతకే ముగింపు.. సేవలకు కాదు, ఇంద్రసేనారెడ్డి సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ మండలం, పంచాయతీరాజ్ శాఖ డీఈగా విధులు నిర్వహించిన ఇంద్రసేనారెడ్డి ప్రభుత్వ సేవల్లో అంకితభావంతో పనిచేసి ప్రజలకు విశేష సేవలందించారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కొనియాడారు. పెద్దఅంబర్‌పేట్‌లో జరిగిన ఇంద్రసేనారెడ్డి పదవీవిరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని, పంచాయతీరాజ్ శాఖలో ఇంద్రసేనారెడ్డి అందించిన సేవలు అభినందనీయమన్నారు. పదవీవిరమణ ఒక బాధ్యతకు ముగింపు మాత్రమేనని, సమాజానికి చేసిన సేవలకు ముగింపు కాదన్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఇంద్రసేనారెడ్డి దంపతులను సన్మానించారు.

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ మండలం, పంచాయతీరాజ్ శాఖ డీఈగా విధులు నిర్వహించిన ఇంద్రసేనారెడ్డి ప్రభుత్వ సేవల్లో అంకితభావంతో పనిచేసి ప్రజలకు విశేష సేవలందించారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కొనియాడారు. పెద్దఅంబర్‌పేట్‌లో జరిగిన ఇంద్రసేనారెడ్డి పదవీవిరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని, పంచాయతీరాజ్ శాఖలో ఇంద్రసేనారెడ్డి అందించిన సేవలు అభినందనీయమన్నారు. పదవీవిరమణ ఒక బాధ్యతకు ముగింపు మాత్రమేనని, సమాజానికి చేసిన సేవలకు ముగింపు కాదన్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఇంద్రసేనారెడ్డి దంపతులను సన్మానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.