ఖమ్మం: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయవాది, దారపునేని కోటేశ్వరరావు గారి సహచరుడు, జనసంఘ్ కాలం నుంచి నేటి వరకు భారతీయ జనతా పార్టీ అభిమానిగా కొనసాగిన షేక్ జాన్ మహమ్మద్ (95) కన్నుమూశారు. నేలకొండపల్లి మండలం అనాసాగరం స్వస్థలమైన ఆయన ఖమ్మం ఇందిరానగర్‌లోని స్వగృహంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ‘ఖమ్మం అద్వానీ’గా గుర్తింపు పొందిన జాన్ మహమ్మద్ మృతిపట్ల బీజేపీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, భౌతికకాయానికి నివాళులర్పించారు. పటేల్–పట్వారి వ్యవస్థలో పట్వారిగా పనిచేసిన ఆయన భూముల కొలతలు కూడా నిర్వహించారు. కుటుంబ సభ్యులకు బీజేపీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ బిజెపి ఇంచార్జి నున్న రవికుమార్
RSS ఖమ్మం విభాగ్ సంఘచాలక్ శ్రీ కాటేపల్లి లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు కోటి హనుమంతరావు, కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా కార్యదర్శి మీగడ గోపి పాల్గొని నివాళులర్పించారు. జాన్ మహమ్మద్ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు.



