ఖమ్మం:
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో విద్యార్థుల పట్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఖమ్మం పట్టణంలోని జెడ్పీ సెంటర్లో “ఫీజుల బకాయి బీజేపీ లడాయి” పేరుతో ఆందోళన చేపట్టనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లగట్టు ప్రవీణ్ కుమార్, గుత్తా వెంకటేశ్వర్లు, నాయుడు రాఘవరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.



