Date 25-8-2026
శ్రీశైలం
శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని మృతి చెందడం కలకలం రేపింది. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు.
గత నెల 28న శ్రీశైలానికి వచ్చిన వీరు సత్రంలోని 11వ గదిని తీసుకున్నారు. గది నుంచి దుర్వాసన రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఐదుగురు మృతిచెందినట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతులను సుధాకర్ (36), ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా గుర్తించారు.



