ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత మహమ్మద్ తాజుద్దీన్ గారి మృతి పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వల్ప అస్వస్థతకు గురైన మహమ్మద్ తాజుద్దీన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు తాజుద్దీన్ గారి నివాసానికి వెళ్లారు. ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తాజుద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, బీఆర్ఎస్లో మహమ్మద్ తాజుద్దీన్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, మైనార్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. తాజుద్దీన్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.



