Tuesday, 25 August 2026
  • Home  
  • ఓల్డ్ నేరేడుమెట్ గౌడ సంఘం స్మశాన వాటికకు నిధుల మంజూరు: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషికి సంఘ సభ్యుల ధన్యవాదాలు
- మేడ్చల్ – మల్కాజిగిరి

ఓల్డ్ నేరేడుమెట్ గౌడ సంఘం స్మశాన వాటికకు నిధుల మంజూరు: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషికి సంఘ సభ్యుల ధన్యవాదాలు

మల్కాజిగిరి: ఓల్డ్ నేరేడుమెట్‌లోని గౌడ కులస్తుల స్మశాన వాటికలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరయ్యాయి. స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం ప్రతినిధులు సోమవారం మల్కాజిగిరి మున్సిపల్ జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ​స్మశాన వాటికలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అక్కడ అవసరమైన మౌలిక వసతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన వెంటనే స్పందించి జోనల్ కమిషనర్‌తో మాట్లాడారు. ఎమ్మెల్యే సూచనల మేరకు స్పందించిన జోనల్ కమిషనర్, తక్షణమే అభివృద్ధి పనులకు కావలసిన నిధులను మంజూరు చేశారు. ​తమ నిరంతర సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపి, నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి మరియు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్‌కు ఓల్డ్ నేరేడుమెట్ గౌడ సంఘం ప్రతినిధులు, సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మల్కాజిగిరి:
ఓల్డ్ నేరేడుమెట్‌లోని గౌడ కులస్తుల స్మశాన వాటికలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరయ్యాయి. స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం ప్రతినిధులు సోమవారం మల్కాజిగిరి మున్సిపల్ జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
​స్మశాన వాటికలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అక్కడ అవసరమైన మౌలిక వసతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన వెంటనే స్పందించి జోనల్ కమిషనర్‌తో మాట్లాడారు. ఎమ్మెల్యే సూచనల మేరకు స్పందించిన జోనల్ కమిషనర్, తక్షణమే అభివృద్ధి పనులకు కావలసిన నిధులను మంజూరు చేశారు.
​తమ నిరంతర సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపి, నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి మరియు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్‌కు ఓల్డ్ నేరేడుమెట్ గౌడ సంఘం ప్రతినిధులు, సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.