*స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమంలో చెత్త బుట్టల పంపిణీ,*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్ట్ 23 వాకాడు మండలం,*
కల్లూరు: స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కల్లూరు పంచాయతీ పరిధిలోని కోడివాక గ్రామంలో చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ కల్లూరు పంచాయతీ ఇన్చార్జి జనార్ధన రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రతి ఇంటి వద్ద చెత్త బుట్టలను వినియోగించాలని ప్రజలకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు చర్యలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.



