వార్త ముఖ్యాంశాలు
- కొవ్వూరు ఆగస్టు 22 పున్నమి న్యూస్ ప్రతినిధి తూర్పు గోదావరి జిల్లా: కొవ్వూరులోని శివానంద మున్సిపల్ పార్క్లో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా పార్క్లో శుభ్రత కార్యక్రమంలో పాల్గొని, చెత్తను తొలగిస్తూ శ్రమదానం చేశారు.
- ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించడంతో పాటు, పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటి చెప్పారు.
కొవ్వూరు ఆగస్టు 22 పున్నమి న్యూస్ ప్రతినిధి
తూర్పు గోదావరి జిల్లా: కొవ్వూరులోని శివానంద మున్సిపల్ పార్క్లో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా పార్క్లో శుభ్రత కార్యక్రమంలో పాల్గొని, చెత్తను తొలగిస్తూ శ్రమదానం చేశారు. ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించడంతో పాటు, పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటి చెప్పారు.
మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన సమాజం ఆరోగ్యంగా ఉంటుంది” అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, వీధి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.
స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా స్వచ్ఛత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
స్వయంగా శ్రమదానం చేస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు,స్వచ్ఛ కొవ్వూరు, ఆరోగ్యకరమైన కొవ్వూరు నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.