Sunday, 23 August 2026
  • Home  
  • 22-ఏ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మేళా 233 దరఖాస్తులు స్వీకరణ – మేళాలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు
- తూర్పు గోదావరి

22-ఏ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మేళా 233 దరఖాస్తులు స్వీకరణ – మేళాలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు

కొవ్వూరు ఆగస్టు 22 పున్నమి న్యూస్ ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు: 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యల పరిష్కారం కోసం శనివారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక మేళా (గ్రీవెన్స్ డ్రైవ్) నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 233 దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మేళాలో పాల్గొని భూ సమస్యల పరిష్కారానికి అధికారులు చేపడుతున్న ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో 22-ఏ నిషేధిత జాబితాలో నమోదై రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన భూములకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిశీలించి పరిష్కరించేందుకు ఈ మేళా నిర్వహించారు. గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించడంతో పాటు సంబంధిత భూముల రికార్డులు, అధికారుల ప్రొసీడింగ్స్, వెబ్‌ల్యాండ్ వివరాలు, డిజిటల్ రికార్డులను అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. సబ్‌డివిజన్ సమస్యలు, వెబ్‌ల్యాండ్‌లోని లోపాలు, రీ-సర్వే, మ్యుటేషన్‌కు సంబంధించిన పెండింగ్ అంశాలు, డాక్యుమెంటేషన్ లోపాలను గుర్తించి నిబంధనల మేరకు పరిష్కరించే చర్యలు చేపట్టారు. తప్పుగా 22-ఏ నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేటు పట్టా భూములను గుర్తించి, అర్హత ఉన్న కేసుల్లో నిబంధనల ప్రకారం క్లియరెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం కీలకమని, ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలను నిర్దిష్ట ప్రక్రియ ద్వారా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రికార్డుల పరిశీలనలో స్పష్టత, పారదర్శకత పాటిస్తూ అర్హులైన భూ యజమానులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. కొవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మేళాలో పాల్గొని భూ సమస్యల పరిష్కార ప్రక్రియను పరిశీలించారు. 22-ఏ జాబితాలో భూములు ఉండటం వల్ల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రత్యేక మేళా ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సానుకూలంగా పరిశీలించి, అర్హత ఉన్న సమస్యలకు నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 22-ఏ భూ సమస్యల పరిష్కారానికి ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక మేళా ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో కె. ఆనందరావు తెలిపారు. 22-ఏ జాబితాలోని భూములకు సంబంధించిన సమస్యలను సంబంధిత రికార్డులతో పరిశీలించి, అవసరమైన చోట తహసీల్దార్లు, సబ్‌రిజిస్ట్రార్ల సమన్వయంతో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తుదారులు పట్టాదారు పాస్‌బుక్, అడంగల్, 1-బి, పాత రిజిస్ట్రేషన్ దస్తావేజులు, 22-ఏ జాబితా వివరాలు లేదా ఈసీ, ఆధార్, సంబంధిత తహసీల్దార్ లేదా కోర్టు ప్రొసీడింగ్స్ వంటి పత్రాలను సమర్పించాలని సూచించారు. 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక మేళాలో తొమ్మిది మండలాల నుంచి మొత్తం 233 దరఖాస్తులు స్వీకరించారు. మండలాల వారీగా కొవ్వూరు నుంచి 71, గోపాలపురం నుంచి 70, నల్లజర్ల నుంచి 27, పెరవలి నుంచి 18, నిడదవోలు నుంచి 16, తాళ్లపూడి నుంచి 14, చాగల్లు నుంచి 9, ఉండ్రాజవరం నుంచి 5, దేవరపల్లి నుంచి 3 దరఖాస్తులు వచ్చాయి. 22-ఏ నిషేధిత జాబితాలో నమోదైన భూముల కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, వెబ్‌ల్యాండ్‌లో తప్పులు, సబ్‌డివిజన్/మ్యుటేషన్ సమస్యలు, రికార్డుల్లో వ్యత్యాసాలు, అర్హత ఉన్న ప్రైవేటు పట్టా భూములు పొరపాటున 22-ఏ జాబితాలో చేరడం వంటి అంశాలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. సంబంధిత తహసీల్దార్ కార్యాలయ రికార్డులు, వెబ్‌ల్యాండ్ వివరాలు, పాత రిజిస్ట్రేషన్ దస్తావేజులు, పట్టాదారు పాస్‌బుక్, అడంగల్, 1-బి, ఈసీ తదితర ఆధారాలను పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేళాలో తొమ్మిది మండలాలకు చెందిన తహసీల్దార్లు, సర్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇతర సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుదారుల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత రికార్డులతో పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన తదుపరి చర్యలను అధికారులు చేపట్టారు.

కొవ్వూరు ఆగస్టు 22 పున్నమి న్యూస్ ప్రతినిధి:

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు: 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యల పరిష్కారం కోసం శనివారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక మేళా (గ్రీవెన్స్ డ్రైవ్) నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 233 దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మేళాలో పాల్గొని భూ సమస్యల పరిష్కారానికి అధికారులు చేపడుతున్న ప్రక్రియను పరిశీలించారు.

జిల్లాలో 22-ఏ నిషేధిత జాబితాలో నమోదై రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన భూములకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిశీలించి పరిష్కరించేందుకు ఈ మేళా నిర్వహించారు. గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించడంతో పాటు సంబంధిత భూముల రికార్డులు, అధికారుల ప్రొసీడింగ్స్, వెబ్‌ల్యాండ్ వివరాలు, డిజిటల్ రికార్డులను అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. సబ్‌డివిజన్ సమస్యలు, వెబ్‌ల్యాండ్‌లోని లోపాలు, రీ-సర్వే, మ్యుటేషన్‌కు సంబంధించిన పెండింగ్ అంశాలు, డాక్యుమెంటేషన్ లోపాలను గుర్తించి నిబంధనల మేరకు పరిష్కరించే చర్యలు చేపట్టారు.

తప్పుగా 22-ఏ నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేటు పట్టా భూములను గుర్తించి, అర్హత ఉన్న కేసుల్లో నిబంధనల ప్రకారం క్లియరెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం కీలకమని, ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలను నిర్దిష్ట ప్రక్రియ ద్వారా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రికార్డుల పరిశీలనలో స్పష్టత, పారదర్శకత పాటిస్తూ అర్హులైన భూ యజమానులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.

కొవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మేళాలో పాల్గొని భూ సమస్యల పరిష్కార ప్రక్రియను పరిశీలించారు. 22-ఏ జాబితాలో భూములు ఉండటం వల్ల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రత్యేక మేళా ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సానుకూలంగా పరిశీలించి, అర్హత ఉన్న సమస్యలకు నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం 22-ఏ భూ సమస్యల పరిష్కారానికి ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక మేళా ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో కె. ఆనందరావు తెలిపారు. 22-ఏ జాబితాలోని భూములకు సంబంధించిన సమస్యలను సంబంధిత రికార్డులతో పరిశీలించి, అవసరమైన చోట తహసీల్దార్లు, సబ్‌రిజిస్ట్రార్ల సమన్వయంతో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.

దరఖాస్తుదారులు పట్టాదారు పాస్‌బుక్, అడంగల్, 1-బి, పాత రిజిస్ట్రేషన్ దస్తావేజులు, 22-ఏ జాబితా వివరాలు లేదా ఈసీ, ఆధార్, సంబంధిత తహసీల్దార్ లేదా కోర్టు ప్రొసీడింగ్స్ వంటి పత్రాలను సమర్పించాలని సూచించారు.

22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక మేళాలో తొమ్మిది మండలాల నుంచి మొత్తం 233 దరఖాస్తులు స్వీకరించారు. మండలాల వారీగా కొవ్వూరు నుంచి 71, గోపాలపురం నుంచి 70, నల్లజర్ల నుంచి 27, పెరవలి నుంచి 18, నిడదవోలు నుంచి 16, తాళ్లపూడి నుంచి 14, చాగల్లు నుంచి 9, ఉండ్రాజవరం నుంచి 5, దేవరపల్లి నుంచి 3 దరఖాస్తులు వచ్చాయి. 22-ఏ నిషేధిత జాబితాలో నమోదైన భూముల కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, వెబ్‌ల్యాండ్‌లో తప్పులు, సబ్‌డివిజన్/మ్యుటేషన్ సమస్యలు, రికార్డుల్లో వ్యత్యాసాలు, అర్హత ఉన్న ప్రైవేటు పట్టా భూములు పొరపాటున 22-ఏ జాబితాలో చేరడం వంటి అంశాలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. సంబంధిత తహసీల్దార్ కార్యాలయ రికార్డులు, వెబ్‌ల్యాండ్ వివరాలు, పాత రిజిస్ట్రేషన్ దస్తావేజులు, పట్టాదారు పాస్‌బుక్, అడంగల్, 1-బి, ఈసీ తదితర ఆధారాలను పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టారు.
ఈ మేళాలో తొమ్మిది మండలాలకు చెందిన తహసీల్దార్లు, సర్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇతర సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుదారుల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత రికార్డులతో పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన తదుపరి చర్యలను అధికారులు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.