ఘనంగా డాక్టర్ పుటిక వెంకటరమణ జన్మదిన వేడుకలు
కడప, ఆగస్టు 21: పున్నమి ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ పుటిక వెంకటరమణ జన్మదిన వేడుకలు శుక్రవారం కడపలోని ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బీరం సుబ్బారెడ్డి, చిత్తూరు జిల్లా ఇన్చార్జి లక్ష్మీనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చేకూరి శారద ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ పుటిక వెంకటరమణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి యువతే వెన్నెముక అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న విధంగా, యువ వయసులోనే డాక్టర్ పుటిక వెంకటరమణ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. బీజేపీ అభివృద్ధి ఫలాలను బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందించడంతో పాటు వారిలో చైతన్యం తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
డాక్టర్ పుటిక వెంకటరమణ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాగేంద్ర, ప్రశాంత్, హరీష్‌తో పాటు కాలనీవాసులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


