బద్రాద్రి కొత్తగూడెం, చుంచుపల్లి మండలం, ఆగస్ట్,20, (పున్నమి ప్రతినిధి)
రామవరం గోదుమ వాగు బ్రిడ్జిపై రంధ్రం పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రమాదం పెరిగి పోలీసులు హెచ్చరిక పోల్ ఏర్పాటు చేశారు. గతంలో గుంతల సమస్యలతో కూడిన ఈ బ్రిడ్జిపై ఇటీవల మరమ్మతులు చేసినా శాశ్వత పరిష్కారం లేక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. ఈ రంధ్రం కారణంగా ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు ఇబ్బంది పడుతూ, ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వర్షపు నీరు నిలిచిపోవడం తో రంధ్రం స్పష్టంగా కనిపించక ప్రమాదం మరింత పెరిగింది. పోలీసులు హెచ్చరిక పోల్ పెట్టినా ప్రజలు ఆందోళనతో ఉన్నారు. స్థానికులు శాశ్వత మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేస్తే ప్రయాణం సురక్షితంగా మారుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



