*ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య*.
తిరుపతి ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి (సిపిఐ)
కళాకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 25వ తేదీన తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆటపాట మాట ప్రదర్శన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య కళాకారులకు పిలుపునిచ్చారు గురువారం తిరుపతి బైరాగి పట్టెడ లోని సిపిఐ కార్యాలయంలో కరపత్రాలు ను విడుదల చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అంటూ అనేక పోరాటాలు చేస్తున్న ఏకైక సంస్థ ప్రజానాట్యమండలి అన్నారు ప్రతి కళాకారుడికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు గ్రామీణ జానపద కళాకారులైన డప్పు డోలు మద్దెల కళాకారుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని చులకన భావంతో చూస్తున్నారని ఇది మంచిది కాదన్నారు సాంస్కృతిక విధానాన్ని తీసుకురావాలని కళాకారుల సంక్షేమం కోసం బడ్జెట్లో 500 కోట్లు నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం కళాకారుల సంక్షేమం పట్ల అంకితభావంతో నిర్దిష్టమైన కార్యక్రమాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న ఆయా స్థానిక గ్రామీణ జానపద పౌరాణిక సాంఘిక కళారూపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం క్యాలెండర్ ను రూపొందించి అమలు పరచాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ప్రోత్సాహం లేనందువలన అనేక కళారూపాలు అనేకమంది కళాకారులు కనుమరుగుపోతున్నారని వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అరసం ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి జే నాగరాజు మాట్లాడుతూ గ్రామీణ జానపద పౌరాణిక నాటక రంగ కళాకారుల అభివృద్ధి కోసం ప్రజానాట్యమండలి పనిచేస్తుందని అన్నారు గ్రామీణ ప్రాంత కళలైన బుర్రకథ హరికథ పల్లె సుద్దులు బాగోతాలు పౌరాణిక నాటకాలు పండరి భజన కులుకు భజన కోలాటం తదితర కళాకారుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 25వ తేదీన తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే మహా ధర్నాకు జిల్లాలో కళాకారులందరూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు ఈ మహా ధర్నా కార్యక్రమం కు అరసం రాష్ట్ర బాధ్యులు పి హరినాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరువుతారని తెలిపారు. కరపత్రాలు ఆవిష్కరించిన వారిలో ప్రజా చైతన్య జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు సి నారాయణదాసు ఉదయ్ భాస్కర్ డప్పుసూరి డి రామచంద్రయ్య పూర్ణ రాము తదితరులు పాల్గొన్నారు


