పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన **‘తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్ 2027’**లో పార్టీ కంటే అభ్యర్థికే పట్టభద్రులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడైంది. 39 శాతం మంది అభ్యర్థి గుణగణాలను,36 శాతం మంది రాజకీయ పార్టీని ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపారు. నిరుద్యోగం, ఉద్యోగ నోటిఫికేషన్లు–భర్తీ ఆలస్యం కలిపి 55 శాతం మందికి ప్రధాన సమస్యగా నిలిచాయి. ప్రస్తుత హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్, నల్గొండ–వరంగల్–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పనితీరుపై 53 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 10 నుంచి 15, 2026 వరకు రెండు నియోజకవర్గాల్లో మొత్తం 10 వేల మంది పట్టభద్రులతో CATI పద్ధతిలో సర్వే నిర్వహించారు.ఇది ఎన్నికల తుది ఫలితాల అంచనా కాదని పీపుల్స్ పల్స్ స్పష్టం చేసింది.

పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం- పీపుల్స్ పల్స్ తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్