Tuesday, 18 August 2026
  • Home  
  • జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ లో కేజీబీవీ పద్మనాభం విద్యార్థినికి స్వర్ణ పతకం
- విశాఖపట్నం

జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ లో కేజీబీవీ పద్మనాభం విద్యార్థినికి స్వర్ణ పతకం

విశాఖపట్నం జిల్లా, పద్మనాభం (పున్నమి ప్రతినిధి,) ఆగస్టు 18 :: జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో కేజీబీవీ పద్మనాభం విద్యార్థిని జి. భాసిత సత్తా చాటి స్వర్ణ పతకం సాధించింది. ఈనెల 16వ తేదీన పెదగంట్యాడలోని ఉక్కు కళా వేదికలో నిర్వహించిన District Kyorugi & Poomsae Taekwondo Championship–2026లో జూనియర్ విభాగంలో భాసిత అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం కేజీబీవీ పద్మనాభంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న భాసిత, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. కోచ్ శ్రీ సురేష్ మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో నిరంతర సాధన చేసి ఈ విజయాన్ని అందుకుంది. భాసిత విజయంపై ప్రిన్సిపాల్ కె. గ్రేస్ లిల్లీ హర్షం వ్యక్తం చేసి అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. ప్రేమ్ కుమార్, ఏపీసీ డా. జె. చంద్రశేఖర్, జీసీడీఓ జి. శ్రీదేవి తదితరులు విద్యార్థినిని అభినందించారు. భాసిత విజయం కేజీబీవీ బాలికలకు స్ఫూర్తిగా నిలిచి, మరింత మంది విద్యార్థినులు క్రీడా రంగంలో రాణించేందుకు ప్రేరణగా నిలుస్తుందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

విశాఖపట్నం జిల్లా, పద్మనాభం (పున్నమి ప్రతినిధి,) ఆగస్టు 18 :: జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో కేజీబీవీ పద్మనాభం విద్యార్థిని జి. భాసిత సత్తా చాటి స్వర్ణ పతకం సాధించింది. ఈనెల 16వ తేదీన పెదగంట్యాడలోని ఉక్కు కళా వేదికలో నిర్వహించిన District Kyorugi & Poomsae Taekwondo Championship–2026లో జూనియర్ విభాగంలో భాసిత అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.

ప్రస్తుతం కేజీబీవీ పద్మనాభంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న భాసిత, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. కోచ్ శ్రీ సురేష్ మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో నిరంతర సాధన చేసి ఈ విజయాన్ని అందుకుంది.

భాసిత విజయంపై ప్రిన్సిపాల్ కె. గ్రేస్ లిల్లీ హర్షం వ్యక్తం చేసి అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. ప్రేమ్ కుమార్, ఏపీసీ డా. జె. చంద్రశేఖర్, జీసీడీఓ జి. శ్రీదేవి తదితరులు విద్యార్థినిని అభినందించారు. భాసిత విజయం కేజీబీవీ బాలికలకు స్ఫూర్తిగా నిలిచి, మరింత మంది విద్యార్థినులు క్రీడా రంగంలో రాణించేందుకు ప్రేరణగా నిలుస్తుందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.