మాడుగుల, ఆగస్టు 17: మాడుగుల మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీ వేమవరపు రామదుర్గరాజు (పెదబాబు) సతీమణి ఇందిర సోమవారం మృతి చెందారు. ఆమె ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ సోదరి.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. ఇందిర మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. ఆమె మృతదేహానికి పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పాత్రికేయులు నివాళులు అర్పించారు.
ఇందిర మృతి విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని వారు ఆకాంక్షించారు.

మాజీ ఎంపీపీ పెదబాబు సతీమణి ఇందిర మృతి
మాడుగుల, ఆగస్టు 17: మాడుగుల మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీ వేమవరపు రామదుర్గరాజు (పెదబాబు) సతీమణి ఇందిర సోమవారం మృతి చెందారు. ఆమె ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ సోదరి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. ఇందిర మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. ఆమె మృతదేహానికి పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పాత్రికేయులు నివాళులు అర్పించారు. ఇందిర మృతి విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని వారు ఆకాంక్షించారు.

