ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, జి. లక్ష్మి నారాయణ, పంది ప్రసాద్‌తో పాటు గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం కి పూలమాల లు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.



