కడపలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ
పున్నమి ప్రతినిధి – కడప:
కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ ఆధ్వర్యంలో శుక్రవారం కడప నగరంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కడప ఏడు రోడ్ల కూడలి నుంచి వై.వి. స్ట్రీట్‌లోని గాంధీ బొమ్మ వరకు క్యాండిళ్లు చేతబూని నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా సయ్యద్ గౌస్ పీర్ మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రామలీలా మైదానంలో జరిగిన కార్యక్రమానికి హాజరై వెళ్లిన అనంతరం, అక్కడ బీజేపీ నాయకులు దళిత నాయకుడు వచ్చి వెళ్లాడంటూ ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసి యజ్ఞం నిర్వహించారని ఆరోపించారు. ఈ ఘటన అత్యంత విచారకరమని అన్నారు.
అంటరానితనాన్ని ప్రోత్సహిస్తూ, కులమతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్, మైనుద్దీన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, మైనారిటీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శులు యూసుఫ్, రఫీక్, మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షుడు నీలం, నగర ఉపాధ్యక్షులు అంజన్ కుమార్, సౌదాగర్ సాదిక్, కేకేసీ నగర చైర్మన్ షమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరీం, యూత్ కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షుడు సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే నగర కమిటీ సభ్యులు, డివిజన్ ఇన్చార్జులు గంగయ్య, హమీదా ఖానమ్, షేక్ అన్వర్, జబీర్, మహబూబ్ బాషా, ఖాజాపీర్, సర్దార్, మురాద్, సాదిక్, జమీల్, ఆరిఫ్‌తో పాటు వివిధ సెల్ల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు.









