ఆత్మకూరు, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన సోమశిల ఎస్సై అనూషను ఉత్తమ అధికారిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేతుల మీదుగా ఎస్సై అనూష ఉత్తమ అధికారి అవార్డును అందుకున్నారు.
సోమశిల పోలీస్స్టేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు ఆమెకు ఈ అవార్డు లభించింది. విధి నిర్వహణలో అంకితభావం, ప్రజల సమస్యల పట్ల స్పందన, శాంతిభద్రతల పరిరక్షణలో చూపిన ప్రతిభను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
ఎస్సై అనూష ఉత్తమ అధికారి అవార్డు అందుకోవడం పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా మరింత అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎస్సై అనూష తెలిపారు.

సోమశిల ఎస్సై అనూషకు ఉత్తమ అధికారి అవార్డు
ఆత్మకూరు, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన సోమశిల ఎస్సై అనూషను ఉత్తమ అధికారిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేతుల మీదుగా ఎస్సై అనూష ఉత్తమ అధికారి అవార్డును అందుకున్నారు. సోమశిల పోలీస్స్టేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు ఆమెకు ఈ అవార్డు లభించింది. విధి నిర్వహణలో అంకితభావం, ప్రజల సమస్యల పట్ల స్పందన, శాంతిభద్రతల పరిరక్షణలో చూపిన ప్రతిభను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఎస్సై అనూష ఉత్తమ అధికారి అవార్డు అందుకోవడం పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా మరింత అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎస్సై అనూష తెలిపారు.

