నందలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి జడ్జి శ్రీ పి. రాజన్ ఉదయ్ ప్రకాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి స్ఫూర్తితో దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనం, పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ అలీ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది, డీఎల్‌ఎస్‌సీ పీఎల్‌వీలు పాల్గొన్నారు. కోర్టు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.

నందలూరు కోర్టులో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు