Wednesday, 19 August 2026
  • Home  
  • జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చేయూత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో
- తూర్పు గోదావరి

జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చేయూత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో

*స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సోమవరం విద్యార్థులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చేయూత* *కాకినాడ , కిర్లంపూడి, ఆగస్టు 15,* 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో విద్యా ప్రతిభను గుర్తించి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ప్రోత్సాహకాలు అందించింది. 2026 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో 3వ ర్యాంక్ సాధించిన జ్యోతుల హర్షిత కు ఫౌండేషన్ తరపున 5000 రూపాయల నగదు ప్రోత్సాహకం అందజేశారు. అదేవిధంగా 9వ తరగతిలో చదువులో రాణించిన విద్యార్థికి 2000 రూపాయలు అందించారు. మొత్తం 7000 రూపాయల ప్రోత్సాహకాలను విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులు మరింత కష్టపడి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సోమవరం నీటి సంఘం చైర్మన్ జ్యోతుల కోటేశ్వరరావు, గంగిరెడ్ల దొరబాబు, మంచికంటి శ్రీను, ప్రగలపాటి వీరబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

*స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సోమవరం విద్యార్థులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చేయూత*

*కాకినాడ , కిర్లంపూడి, ఆగస్టు 15,*

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో విద్యా ప్రతిభను గుర్తించి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ప్రోత్సాహకాలు అందించింది.
2026 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో 3వ ర్యాంక్ సాధించిన జ్యోతుల హర్షిత కు ఫౌండేషన్ తరపున 5000 రూపాయల నగదు ప్రోత్సాహకం అందజేశారు. అదేవిధంగా 9వ తరగతిలో చదువులో రాణించిన విద్యార్థికి 2000 రూపాయలు అందించారు. మొత్తం 7000 రూపాయల ప్రోత్సాహకాలను విద్యార్థులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులు మరింత కష్టపడి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సోమవరం నీటి సంఘం చైర్మన్ జ్యోతుల కోటేశ్వరరావు, గంగిరెడ్ల దొరబాబు, మంచికంటి శ్రీను, ప్రగలపాటి వీరబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.