కేశవరం, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి సహాయ కార్యదర్శిగా సేవలందిస్తూ, పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న పెదపాటి సూర్య గణేష్‌కు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ పెదపాటి విష్ణు మాట్లాడుతూ.. సూర్య గణేష్ తనకు ఆత్మీయ తమ్ముడని, సేవా కార్యక్రమాల్లో తనతో కలిసి ముందుకు సాగుతూ సమాజ సేవ పట్ల నిబద్ధతను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. గణేష్ జీవితంలో ప్రతి అడుగు విజయవంతం కావాలని, ఆయురారోగ్యాలు, ఆనందం, ఆత్మవిశ్వాసంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సమాజ సేవ పట్ల ఆయనకున్న నిబద్ధత మరింత పెరిగి, భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలకు మార్గదర్శిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి బిక్కవోలు మండల శాఖ అధ్యక్షులు, రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత, పున్నమి ప్రతినిధి సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు కూడా పెదపాటి సూర్య గణేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని, సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొని సమాజానికి తనవంతు సేవ అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గణేష్‌కు పలువురు సేవా సమితి సభ్యులు, శ్రేయోభిలాషులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.



