ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఖాజీపేట, ఆగస్టు 15: ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు షేక్ హాజీ గౌస్, షేక్ ముహమ్మద్ హుస్సేన్, షేక్ సగీర్ అహ్మద్, కె. యూసఫ్, ఈ. మొహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


