Wednesday, 30 September 2026

Tag: కడప

కడప

ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఖాజీపేట, ఆగస్టు 15: ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు షేక్ హాజీ గౌస్, షేక్ ముహమ్మద్ హుస్సేన్, షేక్ సగీర్ అహ్మద్, కె. యూసఫ్, ఈ. మొహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

కడప

కళ్యాణ వేడుకల్లో రెడ్యమ్ సోదరులు

*చీమల వారి కళ్యాణ వేడుకల్లో పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితో కలసి పాల్గొన్న రెడ్యం సోదరులు .* *ఆగష్టు 2026 గురువారం రాత్రి.* *సి.కె. దిన్ని మండలం, ఊటుకూరు కు చెందిన చీమల బాల అంకిరెడ్డి జేష్ట పుత్రిక చి॥ల||సౌ|| అనూష, చి|| మహేశ్వర్ రెడ్డి ల కళ్యాణం కడప నగర పరిదిలోని జయరాజ గార్డెన్స్ లో జరిగింది.* *పై కళ్యాణ వేడుకల్లో వైయస్సార్ సిపి జిల్లా అధ్యక్షుడు,మాజీ శాసనసభ్యుడు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి పాల్గొన్న వైఎస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సిపి నేత కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్, రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి లు హాజరై నూతన వదూవరులు కలకాలం చూడముచ్చటైన జంటగా ఉండాలని అక్షంతలు చల్లి దీవెనలు అందించారు.*

కడప

ఖాజీపేట హాస్టల్ సమస్యల నిలయం

ఖాజీపేట సమీకృత సంక్షేమ వసతి గృహంలో కనీస వసతులు కరువు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐవైఎఫ్ కడప ప్రతినిధి ఆగష్టు 13 ఖాజిపేటలోని సమీకృత సంక్షేమ వసతి గృహ సముదాయంలో విద్యార్థులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు బుడ్డొల్ల శ్రీకాంత్ తెలిపారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమీకృత సంక్షేమ వసతి గృహంలోని బాత్రూమ్‌ల పరిస్థితి దారుణంగా ఉందని, పలు బాత్రూమ్‌లకు తలుపులు సక్రమంగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రీకాంత్ పేర్కొన్నారు. బాత్రూమ్‌లకు వెళ్లేందుకు కంపచెట్లు, పొదల మధ్య నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, దీనివల్ల విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, గౌరవానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థులతో నీళ్లు మోయించడం, వంట పనులు చేయించడం, భోజనం వడ్డించడం వంటి పనులు చేయిస్తున్నారనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో వారితో ఇలాంటి పనులు చేయించడం సరికాదన్నారు. దీనిపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను తేల్చాలని డిమాండ్ చేశారు. వసతి గృహంలోని బాత్రూమ్‌లు, తలుపులు, భవనం, తాగునీరు, పరిశుభ్రత, విద్యార్థుల వసతి తదితర మౌలిక సదుపాయాలను అధికారులు పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరారు. విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అన్నారు. విద్యార్థులతో పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు నిజమని తేలితే వార్డెన్, సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. విద్యార్థులకు తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సరైన తలుపులు, మెరుగైన నివాస సదుపాయాలు వెంటనే కల్పించాలని శ్రీకాంత్ కోరారు. విద్యార్థుల సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని బుడ్డొల్ల శ్రీకాంత్ హెచ్చరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.