సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్
కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది.
అర్హత కలిగిన వైద్యులు సంబంధిత నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నియామకానికి సంబంధించిన వివరాలను జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

