సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
మన్సూరాబాద్, ఆగస్టు 14: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బహుగుణం భాస్కర శర్మ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్‌కు చెందిన భాస్కర శర్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డిని సంప్రదించారు.
వారి విజ్ఞప్తిపై స్పందించిన శివ చరణ్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో CMRFకు దరఖాస్తు చేయించారు. అనంతరం ప్రభుత్వం నుంచి రూ.60 వేల విలువైన చెక్కు మంజూరైంది.
మంజూరైన చెక్కును శుక్రవారం మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జక్కిడి సత్య తేజ రెడ్డి, మృతుడి కుమారుడు విజయభాస్కర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో విఠల్ రెడ్డి, జకీర్ తదితరులు పాల్గొన్నారు.



