Saturday, 15 August 2026
  • Home  
  • నేర్రపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ
- రంగారెడ్డి

నేర్రపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

నేర్రపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నేర్రపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన యూనిఫామ్‌లను గ్రామ సర్పంచ్ గొద్దెండ్ల హేమలత శ్రీహరి, ఉప సర్పంచ్ వెలగ వేణుగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొద్దెండ్ల హేమలత శ్రీహరి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్‌లను అందజేస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు మాధవ్, గ్రామ కార్యదర్శి రాజ్‌కుమార్, స్కూల్ చైర్మన్ శ్రీలత, పొదుపు సంఘం వీఓ పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నేర్రపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నేర్రపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన యూనిఫామ్‌లను గ్రామ సర్పంచ్ గొద్దెండ్ల హేమలత శ్రీహరి, ఉప సర్పంచ్ వెలగ వేణుగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గొద్దెండ్ల హేమలత శ్రీహరి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్‌లను అందజేస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు మాధవ్, గ్రామ కార్యదర్శి రాజ్‌కుమార్, స్కూల్ చైర్మన్ శ్రీలత, పొదుపు సంఘం వీఓ పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.