Saturday, 15 August 2026
  • Home  
  • ఆత్మకూరులో రేపు అభిరామ్ హాస్పిటల్స్ వారి ఉచిత వైద్య శిబిరం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో రేపు అభిరామ్ హాస్పిటల్స్ వారి ఉచిత వైద్య శిబిరం

ఉపశీర్షిక: ఆర్థో, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, దంత, మహిళల ఆరోగ్యం, డయాబెటిస్‌, గుండె సంబంధిత సమస్యలకు నిపుణుల వైద్య సేవలు ఆత్మకూరు, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): అభిరామ్ హాస్పిటల్స్, అభిరామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఆత్మకూరులో ఈ నెల 15వ తేదీ శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. పాత సిండికేట్ బ్యాంక్ ప్రక్కన, యల్.ఆర్.పల్లి వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం కొనసాగనుంది.ఈ శిబిరంలో వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, సలహాలు అందించనున్నారు. ఎముకలు, కీళ్లు, వెన్నెముక సమస్యలకు డా. ఎస్. శివరామ్, చిన్నారుల వైద్యానికి డా. యస్.కె. వశీం, జనరల్ సర్జరీకి డా. శ్రీ చరణ్, డి.ఎం.ఓ. విభాగంలో డా. సుభాష్, దంత వైద్యానికి డా. నాగిరెడ్డి ప్రసన్నక సేవలు అందించనున్నారు.మహిళల ఆరోగ్య సమస్యలు, గర్భకోశ సంబంధిత వ్యాధులకు డా. దీపి మేకపాటి, మధుమేహం, బీపీ, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలకు డా. కె.వి. శ్రావణ్ కుమార్ వైద్య సలహాలు అందించనున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, ఆస్తమా తదితర సమస్యలపై కూడా వైద్య సూచనలు ఇవ్వనున్నారు.ఆత్మకూరు, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. వివరాలకు 9490631643 నంబరును సంప్రదించవచ్చు.

ఉపశీర్షిక: ఆర్థో, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, దంత, మహిళల ఆరోగ్యం, డయాబెటిస్‌, గుండె సంబంధిత సమస్యలకు నిపుణుల వైద్య సేవలు

ఆత్మకూరు, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): అభిరామ్ హాస్పిటల్స్, అభిరామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఆత్మకూరులో ఈ నెల 15వ తేదీ శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. పాత సిండికేట్ బ్యాంక్ ప్రక్కన, యల్.ఆర్.పల్లి వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం కొనసాగనుంది.ఈ శిబిరంలో వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, సలహాలు అందించనున్నారు. ఎముకలు, కీళ్లు, వెన్నెముక సమస్యలకు డా. ఎస్. శివరామ్, చిన్నారుల వైద్యానికి డా. యస్.కె. వశీం, జనరల్ సర్జరీకి డా. శ్రీ చరణ్, డి.ఎం.ఓ. విభాగంలో డా. సుభాష్, దంత వైద్యానికి డా. నాగిరెడ్డి ప్రసన్నక సేవలు అందించనున్నారు.మహిళల ఆరోగ్య సమస్యలు, గర్భకోశ సంబంధిత వ్యాధులకు డా. దీపి మేకపాటి, మధుమేహం, బీపీ, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలకు డా. కె.వి. శ్రావణ్ కుమార్ వైద్య సలహాలు అందించనున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, ఆస్తమా తదితర సమస్యలపై కూడా వైద్య సూచనలు ఇవ్వనున్నారు.ఆత్మకూరు, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. వివరాలకు 9490631643 నంబరును సంప్రదించవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.