Friday, 14 August 2026
  • Home  
  • హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా అఖండ భారత్ దివాస్.
- నిర్మల్

హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా అఖండ భారత్ దివాస్.

కుబీర్. ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి,కుబీర్ మండల కేంద్రంలో హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో అఖండ భారత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హిందూ వాహిని అధ్యక్షుడు నాగభూషణ్ కాషాయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. భారతదేశం యొక్క అఖండత, సార్వభౌమత్వం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. అఖండ భారత నిర్మాణం కోసం దేశభక్తి, ఐక్యత, సేవాభావంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా యువత దేశానికి వెన్నెముకగా నిలవాలని, గంజాయి, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలకు బానిసలు కాకుండా క్రమశిక్షణ, విద్య, దేశభక్తి, సేవా భావాలను అలవర్చుకోవాలని సూచించారు. యువత సరైన మార్గంలో నడిస్తేనే బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. దేశం కోసం పనిచేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ సమాజంలో ఐక్యతను పెంపొందించాలని వక్తలు కోరారు. కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

కుబీర్. ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి,కుబీర్ మండల కేంద్రంలో హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో అఖండ భారత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హిందూ వాహిని అధ్యక్షుడు నాగభూషణ్ కాషాయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. భారతదేశం యొక్క అఖండత, సార్వభౌమత్వం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. అఖండ భారత నిర్మాణం కోసం దేశభక్తి, ఐక్యత, సేవాభావంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేకంగా యువత దేశానికి వెన్నెముకగా నిలవాలని, గంజాయి, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలకు బానిసలు కాకుండా క్రమశిక్షణ, విద్య, దేశభక్తి, సేవా భావాలను అలవర్చుకోవాలని సూచించారు. యువత సరైన మార్గంలో నడిస్తేనే బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు.
దేశం కోసం పనిచేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ సమాజంలో ఐక్యతను పెంపొందించాలని వక్తలు కోరారు. కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.