*నా దేశమే నా గర్వం* 🇮🇳
ఆగస్టు 15 అంటే ఒక తేదీ కాదు…
అది త్యాగాల జ్ఞాపకం,
అది స్వేచ్ఛకు ప్రతిరూపం.
ఎందరో వీరుల కల ఫలితం,
ఎందరో వీరుల కన్నీటి బలిదానం,
ఎర్రకోటపై ఎగిరే త్రివర్ణ పతాకం!
జెండా చెబుతుంది — దేశాన్ని ప్రేమించు అని…
అశోక చక్రం చెబుతుంది — ముందుకు సాగు అని…
కాషాయం త్యాగాన్ని నేర్పిస్తే,
తెలుపు శాంతిని పంచుతుంది,
ఆకుపచ్చ అభివృద్ధి వైపు నడిపిస్తుంది.
నేటి విద్యార్థులమే రేపటి పౌరులం,
మన చేతుల్లోనే ఉంది దేశ భవిష్యత్తు.
కష్టపడి చదివి, నిజాయితీగా బ్రతికి,
దేశానికి పేరు తెచ్చే వారిగా ఎదుగుదాం.
మన కర్తవ్యాన్ని మరువకుండా,
ఐక్యతతో ముందుకు సాగితే
మన భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.
ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే,
దేశభక్తి మన గుండెల్లో పొంగిపొర్లాలి.
“భారతమాతకు జై!” అంటూ
ఆకాశమే హద్దుగా ఎదుగుదాం!
ఎక్కడున్నా…
నా దేశమే నా ప్రాణం,
ఎప్పటికీ నా దేశమే నా గర్వం.
శాంతి, ప్రేమను పంచుదాం,
సోదర భావాన్ని పెంచుదాం.
మన దేశ గర్వం — మన త్రివర్ణ పతాకం!
మన ఆత్మగౌరవానికి ప్రతీక — భారత జాతీయ జెండా!
భారతమాత ఒడిలో పుట్టడం
మనందరి అదృష్టం.
*🇮🇳 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳*
*జైహింద్! వందేమాతరం!*
రేవెళ్లి పద్మ..
9381430399


