Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబ్ నగర్

స్వతంత్ర భారత అవని

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్వతంత్ర భారత అవని

*స్వతంత్ర భారత విజయగాథ*

స్వాతంత్ర్యమే మన శ్వాస —
స్వాభిమానమే మన ఆశ!
త్యాగాల పునాదులపై
వెలసిన భారతదేశం —
విజయగాథే మన చరిత్ర!!

తెల్లదొరల పాలనలో
వెన్ను వంచని వీరులు,
దేశమాత విముక్తికై
ప్రాణాలర్పించిన ధీరులు!

గాంధీజీ అహింసా మార్గం,
నేతాజీ వీర గర్జనం,
భగత్‌సింగ్‌ త్యాగజ్వాల,
అల్లూరి అగ్ని పోరాటం—
వీరుల రక్తంతో రాసిన
స్వాతంత్ర్య విజయగాథ!

పల్లె నుంచి పట్టణం దాకా
ఒక్కటైన జనగణం,
జాతి–మత భేదాలన్నీ
మరచిపోయిన భారతం!

ఆగస్టు పదిహేను ఉదయం
ఎర్రకోటపై ఎగిరిన త్రివర్ణం,
కోట్లాది హృదయాల్లో
నింపింది స్వేచ్ఛా స్ఫూర్తి!

అక్షరాస్యత పెరిగింది,
అభివృద్ధి బాటలు తెరిచింది,
అంతరిక్షంలో అడుగుపెట్టి
ఆకాశాన్నే అందుకుంది!

చంద్రయాన్‌ విజయంతో
చంద్రుడిపై ముద్ర వేసి,
డిజిటల్‌ భారత స్వప్నంతో
ప్రపంచానికే దిశ చూపింది!

వ్యవసాయం నుంచి విజ్ఞానం వరకు,
క్రీడల నుంచి సాంకేతికత వరకు,
ప్రతి రంగంలో భారత కీర్తి
విశ్వవేదికపై మార్మోగింది!

ఇది కేవలం స్వాతంత్ర్యం కాదు—
స్వప్నాలను సాకారం చేసే శక్తి!
ఇది కేవలం విజయగాథ కాదు—
భవిష్యత్తును నిర్మించే బాధ్యత!

వీరుల త్యాగం ,
దేశ గౌరవం తగ్గనీయక,
ఐక్యత అనే జెండా పట్టుకుని
అభివృద్ధి దిశగా సాగుదాం!

జ్ఞానమే మన ఆయుధంగా,
నీతియే మన మార్గంగా,
యువతే మన బలంగా,
భారతమే మన గర్వంగా—

విశ్వగురువై వెలుగొందే
వైభవ భారతాన్ని నిర్మిద్దాం!
జై హింద్!
జై భారత్!
వందే మాతరం!!

*డాక్టర్ ఎంఎన్ విజయకుమార్ కవి, రచయిత, సంపాదకులు, పాలమూరు జిల్లా*

స్వతంత్ర భారత అవని

Leave a comment

Your email address will not be published. Required fields are marked *