ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని మహి ఎక్స్ట్రా ప్రీమియర్ డిటర్జెంట్ ప్రొడక్ట్ తయారీ ఫ్యాక్టరీని సర్వసమేతంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ బీసీ నాయకుడు చల్ల గిరి ప్రసాద్, ఆయన సతీమణి ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫ్యాక్టరీలో డిటర్జెంట్, లిక్విడ్ తయారీ ప్రక్రియను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ సహకారంతో సొంతంగా లిక్విడ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్న విధానాన్ని అభినందించారు. స్థానికంగా చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మనుబోలులో డిటర్జెంట్ తయారీ యూనిట్ సందర్శించిన ఎమ్మెల్యే
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని మహి ఎక్స్ట్రా ప్రీమియర్ డిటర్జెంట్ ప్రొడక్ట్ తయారీ ఫ్యాక్టరీని సర్వసమేతంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ బీసీ నాయకుడు చల్ల గిరి ప్రసాద్, ఆయన సతీమణి ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫ్యాక్టరీలో డిటర్జెంట్, లిక్విడ్ తయారీ ప్రక్రియను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ సహకారంతో సొంతంగా లిక్విడ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్న విధానాన్ని అభినందించారు. స్థానికంగా చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

