Thursday, 13 August 2026
  • Home  
  • బెదిరింపులపై పోలీస్ఎ లకి ఏక్సైజ్ డీసీ సోమిరెడ్డి ఫిర్యాదు
- ఖమ్మం

బెదిరింపులపై పోలీస్ఎ లకి ఏక్సైజ్ డీసీ సోమిరెడ్డి ఫిర్యాదు

ఖమ్మం ఆగష్టు 13 (పున్నమి ప్రతినిధి) ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా దూషిస్తూ, అసభ్యకరమైన సందేశాలు పంపిన వ్యక్తిపై ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లందుకు చెందిన మద్యం వ్యాపారి కొండపల్లి గణేష్ తన సెల్‌ఫోన్ నంబర్ నుంచి తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు సోమిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సందేశాలు పంపుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు చెప్పారు. కొండపల్లి గణేష్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి వెల్లడించారు.

ఖమ్మం ఆగష్టు 13
(పున్నమి ప్రతినిధి)

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా దూషిస్తూ, అసభ్యకరమైన సందేశాలు పంపిన వ్యక్తిపై ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లందుకు చెందిన మద్యం వ్యాపారి కొండపల్లి గణేష్ తన సెల్‌ఫోన్ నంబర్ నుంచి తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు సోమిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సందేశాలు పంపుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు చెప్పారు. కొండపల్లి గణేష్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.