శ్రీ కాళహస్తి, ఆగస్టు 11, (పున్నమి న్యూస్): న్యూఢిల్లీలో కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గాల ఐక్యత, హక్కుల సాధన లక్ష్యంగా ఢిల్లీలో నిర్వహించిన జాతీయ మహాసభలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు సాన సతీష్, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ….ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశ, విదేశాల్లో స్థిరపడిన కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఇటువంటి జాతీయ స్థాయి సదస్సులు కీలకంగా నిలుస్తాయన్నారు. సామాజిక వర్గాల ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ను జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మహాసభలో కోరారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా చట్టసభలు, నామినేటెడ్ పదవుల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాపు కార్పొరేషన్‌కు ఏటా సుమారు రూ.3,000 కోట్ల నిధులు కేటాయించడంతో పాటు మహిళలకు ఎంఎస్ఎంఈ రంగంలో ప్రత్యేక రాయితీలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీలో మహాసభ నిర్వహించడం ద్వారా సామాజిక వర్గాల సమస్యలు, డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ పెద్దలు, జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభించిందన్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడిన కాపు, బలిజ వర్గాలకు చెందిన నేతలు, అధికారులు, వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకురావడం మహాసభ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని కోలా ఆనంద్ తెలిపారు. కాపు, బలిజ సామాజిక వర్గాలకు చెందిన చారిత్రక వీరుడు, రాజు శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలను ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని మహాసభలో డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.

ఢిల్లీలో కాపు, తెలగ, బలిజ మహాసభలో పాల్గొన్న కోలా ఆనంద్