Wednesday, 12 August 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో నేటి నుండి ఓటర్ల నోటీసులపై విచారణ-మున్సిపల్ కమిషనర్
- తిరుపతి

శ్రీకాళహస్తిలో నేటి నుండి ఓటర్ల నోటీసులపై విచారణ-మున్సిపల్ కమిషనర్

శ్రీ కాళహస్తి, ఆగస్టు 11, (పున్నమి న్యూస్): భారత ఎన్నికల సంఘం, తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) 2026 కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్, సహాయ ఓటరు నమోదు అధికారి ఒక అధికారిక ప్రకటన ద్వారా తెలిపారు. నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం ‘నో మ్యాపింగ్’ కింద 5,467 మందికి, అలాగే వివిధ రకాల వ్యత్యాసాల (అనమలీస్) కింద 12,126 మందికి గుర్తించిన నోటీసులను ఓటర్లకు ఇప్పటికే అందజేయడం జరిగిందని వెల్లడించారు. ఈ నోటీసులపై నేటి 17-09-2026 వరకు శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక విచారణ జరపడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 02:30 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 03:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు ఈ విచారణ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. నోటీసులు అందుకున్న ఓటర్లందరూ తమకు కేటాయించిన నిర్ణీత తేదీ, సమయాల్లో తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని కోరారు. విచారణ సమయాల్లో ఓటరు, వారి తల్లిదండ్రుల యొక్క ఒరిజినల్ గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రాలను సంబంధిత బూత్ స్థాయి అధికారులకు (BLO) అందజేసి, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు, తద్వారా బలమైన ప్రజాస్వామ్య పునాదికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.