విద్యార్థుల్లో వినియోగదారుల హక్కులపై అవగాహన
ఉదయగిరి: విద్యార్థుల్లో వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ మరియు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో పాఠశాలల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల పూర్తి నివేదికను జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ (డీఎస్ఓ) ఇండ్ల పుల్లయ్యకు ఫోరం ప్రతినిధులు అందజేశారు. జిల్లా అధ్యక్షులు కొండేపోగు దిలీప్ కుమార్, జిల్లా స్టీరింగ్ అండ్ మానిటరింగ్ అధ్యక్షులు ఎస్.డి. అక్బర్ కార్యక్రమాల వివరాలను వివరించారు. అనంతరం ఉదయగిరి పరిధిలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు టైర్లకు గాలి నింపే సౌకర్యం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. బంకులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని డీఎస్ఓను కోరారు.

విద్యార్థుల్లో వినియోగదారుల హక్కులపై అవగాహన
విద్యార్థుల్లో వినియోగదారుల హక్కులపై అవగాహన ఉదయగిరి: విద్యార్థుల్లో వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ మరియు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో పాఠశాలల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల పూర్తి నివేదికను జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ (డీఎస్ఓ) ఇండ్ల పుల్లయ్యకు ఫోరం ప్రతినిధులు అందజేశారు. జిల్లా అధ్యక్షులు కొండేపోగు దిలీప్ కుమార్, జిల్లా స్టీరింగ్ అండ్ మానిటరింగ్ అధ్యక్షులు ఎస్.డి. అక్బర్ కార్యక్రమాల వివరాలను వివరించారు. అనంతరం ఉదయగిరి పరిధిలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు టైర్లకు గాలి నింపే సౌకర్యం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. బంకులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని డీఎస్ఓను కోరారు.

