ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఐ అంకమ్మరావు
ఉదయగిరి సర్కిల్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన బొప్పన అంకమ్మరావు సోమవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఐకు అభినందనలు తెలిపి, నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు. పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా విధులు నిర్వహించాలని, చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఐ
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఐ అంకమ్మరావు ఉదయగిరి సర్కిల్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన బొప్పన అంకమ్మరావు సోమవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఐకు అభినందనలు తెలిపి, నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు. పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా విధులు నిర్వహించాలని, చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు

