పున్నమి, న్యూస్ ప్రతినిధి వేముల మండలం, ఆగస్టు 11:
దేశభక్తి భావాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లే లక్ష్యంతో “హర్ ఘర్ తిరంగా – 2026” కార్యక్రమాన్ని బెస్త వారి పల్లె గ్రామసమాఖ్య ఆధ్వర్యంలో వెలుగు డి ఆర్ డి ఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వేముల మండల మహిళా సమాఖ్య పరిధిలో 32 గ్రామసమాఖ్య లు 543 స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు
2026 ఆగస్టు 09 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండా పట్ల గౌరవం, దేశభక్తి మరియు జాతీయ ఐక్యతను చాటాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.ప్రధాన కార్యక్రమాలు
తిరంగా ర్యాలీలు నిర్వహించడం
“తిరంగాతో సెల్ఫీ – Selfie with Tiranga” కార్యక్రమం
వందే మాతరం గీతాలాపన
దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు
తిరంగా థీమ్‌తో రంగోలి పోటీలు
విద్యార్థులు, యువత, మహిళా సంఘాల భాగస్వామ్యం
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ప్రదర్శించేలా ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యం గా మహిళా సంఘాలు కృషి చేయాలనీ సూచించారు. ప్రతి భారత పౌరుడు మన ప్రతిజ్ఞ
“జాతీయ జెండాను గౌరవిద్దాం…
దేశ ఐక్యతను కాపాడుదాం…
దేశభక్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్దాం…”ఈ సందర్భంగా “నా ఇల్లు – నా తిరంగా… నా గర్వం – నా భారత్” అనే సందేశంతో ప్రతి కుటుంబం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.జాతీయ జెండా మన స్వాతంత్ర్యానికి, దేశ ఐక్యతకు, త్యాగాలకు ప్రతీక అని, తిరంగాను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ కో ఆర్డినేటర్ హరి కృష్ణ, గ్రామసమాఖ్య అసిస్టెంట్ చందన మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు..






