Monday, 10 August 2026
  • Home  
  • గ్రామాల సమగ్ర సమాచార సేకరణకు DCHB
- విశాఖపట్నం

గ్రామాల సమగ్ర సమాచార సేకరణకు DCHB

పద్మనాభం మండలంలో సర్వే శిక్షణా కార్యక్రమం విజయవంతం విశాఖపట్నం,పద్మనాభం, ఆగస్టు 10 (పున్నమి ప్రతినిధి): జిల్లా జనాభా గణాంకాల పుస్తక సర్వేకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని పద్మనాభం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో తహసీల్దార్ మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సర్వే ద్వారా ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన జనాభా వివరాలు, సామాజిక–ఆర్థిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, గ్రామాల అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు 30 రోజుల పాటు ఈ సర్వే కార్యక్రమం కొనసాగనుంది. సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు గణకులకు శిక్షణ ఇచ్చి, సమాచార సేకరణలో పాటించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివరాల నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు జనగణన కమిషనర్ కార్యాలయం, న్యూఢిల్లీ నుంచి వచ్చిన సంయుక్త సంచాలకులు ఎం.కె. తివారీ, సహాయ సంచాలకులు పంకజ్ కౌశిక్, ఆంధ్రప్రదేశ్ జనగణన సంచాలకుల కార్యాలయం నుంచి సహాయ సంచాలకులు సుప్రేజ్ కె. పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర అధికారులు గణకులకు పలు సూచనలు అందిస్తూ, గ్రామాల వారీగా ఖచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని సూచించారు. గ్రామాల ప్రస్తుత పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు, మౌలిక వసతుల స్థితిగతులను అంచనా వేసేందుకు ఈ సర్వే ద్వారా సేకరించే సమాచారం ఎంతో కీలకంగా నిలవనుంది.

పద్మనాభం మండలంలో సర్వే శిక్షణా కార్యక్రమం విజయవంతం

విశాఖపట్నం,పద్మనాభం, ఆగస్టు 10 (పున్నమి ప్రతినిధి):

జిల్లా జనాభా గణాంకాల పుస్తక సర్వేకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని పద్మనాభం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో తహసీల్దార్ మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.

ఈ సర్వే ద్వారా ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన జనాభా వివరాలు, సామాజిక–ఆర్థిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, గ్రామాల అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు.

ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు 30 రోజుల పాటు ఈ సర్వే కార్యక్రమం కొనసాగనుంది. సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు గణకులకు శిక్షణ ఇచ్చి, సమాచార సేకరణలో పాటించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివరాల నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ శిక్షణా కార్యక్రమాన్ని భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు జనగణన కమిషనర్ కార్యాలయం, న్యూఢిల్లీ నుంచి వచ్చిన సంయుక్త సంచాలకులు ఎం.కె. తివారీ, సహాయ సంచాలకులు పంకజ్ కౌశిక్, ఆంధ్రప్రదేశ్ జనగణన సంచాలకుల కార్యాలయం నుంచి సహాయ సంచాలకులు సుప్రేజ్ కె. పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా కేంద్ర అధికారులు గణకులకు పలు సూచనలు అందిస్తూ, గ్రామాల వారీగా ఖచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని సూచించారు.

గ్రామాల ప్రస్తుత పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు, మౌలిక వసతుల స్థితిగతులను అంచనా వేసేందుకు ఈ సర్వే ద్వారా సేకరించే సమాచారం ఎంతో కీలకంగా నిలవనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.