ఖమ్మం ఆగష్టు 10
(పున్నమి ప్రతి నిధి)
పాలేరు /ఖమ్మం
హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి నున్న రవికుమార్ సోమవారం తన స్వగృహంపై జాతీయ జెండాను ఎగురవేశారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. హర్ ఘర్ తిరంగా అభియాన్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని నున్న రవికుమార్ సూచించారు.



