Monday, 10 August 2026
  • Home  
  • ఎడ్‌బిడ్‌లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
- నిర్మల్

ఎడ్‌బిడ్‌లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

ముథోల్, ఆగస్టు 9 (పున్నమి ప్రతినిధి ):ముథోల్‌ మండలం ఎడ్‌బిడ్‌ గ్రామంలో నాయక్‌పోడ్‌ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే పలు కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆదివాసీ ఉద్యమ వీరుడు కొమురం భీమ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీమ్‌ చేసిన పోరాటాన్ని, ఆయన స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామ్ చందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నిమ్మపోతన్న, ఉప సర్పంచ్ నాయక్ పొడ్ సంఘం సభ్యులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.